Thu Dec 19 2024 18:17:37 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు కోటి పరిహారం
అచ్యుతాపురంలోని ఫార్మా సెజ్ లో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ స్పందించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
అచ్యుతాపురంలోని ఫార్మా సెజ్ లో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ స్పందించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అచ్యుతాపురం సెజ్ లో నిన్న రియాక్టర్ పేలి పదిహేడు మంది మరణించారు. అరవై మంది గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం భారీగా నష్టపరిహారం ప్రకటించింది.
క్షతగాత్రులకు...
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ప్రకటించారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు, గాయపడిన వారికి యాభై వేల రూపాయలు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందిస్తామని కలెక్టర్ స్పందించారు. యాజమాన్యం బాధ్యతా రాహిత్యంపై ఏపీ ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది.
Next Story